BREAKING
ఒడిశాలో మరో 2.91 లక్షల గ్రామీణ ఇళ్ల నిర్మాణం: 'అంత్యోదయ గృహ యోజన'ను 2029 వరకు పొడిగించిన మోహన్ చరణ్ మాఝీ ప్రభుత్వం! ధర్మ రక్షణకు అవసరమైతే బాంబులు, ఫిరంగులు ప్రయోగిస్తాం.. సీఎం యోగి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మద్దతు! మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నందిగామలో గౌడ హాస్టల్‌ను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బ్యాంకాక్‌లో నిర్మలా సీతారామన్ కీలక సంభాషణ: అంతర్జాతీయ ద్రవ్య నిధి వార్షిక సదస్సులో మైఖేల్ కుగెల్‌మన్‌తో భారత ఆర్థిక వృద్ధి, గ్లోబల్ సరఫరా గొలుసులపై చర్చ! దుబ్బాకలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీకి మంత్రి వివేక్ వెంకటస్వామి రాక జ్ఞాన సరస్వతిగా దుర్గ మాత వైభవంగా బోనాల ఉత్సవాలు అయోధ్య రామాలయ ప్రాంగణంలో అమరవీరుల స్మారకం నిర్మాణం పూర్తి: త్వరలోనే ప్రారంభానికి ఏర్పాట్లు.. నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడి! వైభవంగా దేవి శరన్నవరాత్రులు హుస్నాబాద్‌కు దసరా కానుక.. నూతన కబడ్డీ అకాడమీకి ప్రభుత్వ జీవో జారీ పండుగ సాయన్న జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించాలి: రెండేళ్లకు గిరిజన యువతికి కొత్త జీవితం: సుక్మా బాధితురాలికి కృత్రిమ కాలు అమర్చిన ప్రభుత్వం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు చోదిమళ్ళ లో సాయి నక్షత్ర మాలిక, స్థవణ మంజరి పారాయణం అక్టోబర్ 16న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం.. భక్తులకు అన్నీ ఏర్పాట్లు

చోదిమళ్ళ లో సాయి నక్షత్ర మాలిక, స్థవణ మంజరి పారాయణం అక్టోబర్ 16న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం.. భక్తులకు అన్నీ ఏర్పాట్లు

Select Suryaa Now
చోదిమళ్ళ లో సాయి నక్షత్ర మాలిక, స్థవణ మంజరి  పారాయణం  అక్టోబర్ 16న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం.. భక్తులకు అన్నీ ఏర్పాట్లు

ఏలూరు/చోదిమళ్ల, అక్టోబర్ 16 సూర్య న్యూస్: ఏలూరు జిల్లా చోదిమళ్ల గ్రామంలో షిరిడీ సాయిబాబా భక్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. షిరిడీ సాయినాథుడు మహాసమాధి చెంది 108 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, హైదరాబాద్ శ్రీ కాళ్ళ రత్నాజీ షిరిడి సాయి సేవాదళ్  ఫౌండర్ వారి ఆధ్వర్యంలో సాయి నక్షత్ర మాలిక, స్థవణ మంజరి పారాయణ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 రాష్ట్రవ్యాప్తంగా  108 బాబా మందిరాల్లో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించాలనే సంకల్పంలో భాగంగా చోదిమళ్ళ  గ్రామంలోనూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు

అక్టోబర్ 16వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో సాయిబాబా భక్తులు పాల్గొని సాయి నామస్మరణ, పారాయణంలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు.

500 మంది భక్తులకు ప్రసాదాల ఏర్పాటు

ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమానికి హాజరయ్యే భక్తులందరికీ ప్రసాదాల పంపిణీ చేయనున్నట్లు సాయిబాబా కమిటీ సభ్యులు వి.వెంకటేశ్వరరావు, చందర్రావు,లు వివరించారు.

భక్తులకు ఆహ్వానం

సాయిబాబా భక్తులందరూ ఈ పవిత్ర పారాయణ కార్యక్రమంలో పాల్గొని సాయినాథుని కృపాకటాక్షాలు, ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.

 పసుమర్తి రాము జలా ఇంచార్జ్ ఏలూరు,