BREAKING
ప్రయాణ ప్రాంగణమా? మురుగు నిలయమా? ప్రయాణికుల సౌకర్యం కోసం 24 గంటల ఎంక్వయిరీ సేవలు ప్రజా సమస్యలపై రాచమల్లు దంపతుల క్షేత్రస్థాయి పర్యటన… అధికారుల తీరుపై ఆగ్రహం రేణిగుంటలో ఎన్నికల కోడ్‌ అమలు.. కర్నూలు జీవి మాల్ లో భారీ అగ్నిప్రమాదం చిన్న గుర్రాయిగూడెంలో వైభవంగా కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తులతో కిటకిటలాడుతున్న అమ్మవారి ఆలయం ఒడిశాలో మరో 2.91 లక్షల గ్రామీణ ఇళ్ల నిర్మాణం: 'అంత్యోదయ గృహ యోజన'ను 2029 వరకు పొడిగించిన మోహన్ చరణ్ మాఝీ ప్రభుత్వం! ధర్మ రక్షణకు అవసరమైతే బాంబులు, ఫిరంగులు ప్రయోగిస్తాం.. సీఎం యోగి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మద్దతు! మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నందిగామలో గౌడ హాస్టల్‌ను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బ్యాంకాక్‌లో నిర్మలా సీతారామన్ కీలక సంభాషణ: అంతర్జాతీయ ద్రవ్య నిధి వార్షిక సదస్సులో మైఖేల్ కుగెల్‌మన్‌తో భారత ఆర్థిక వృద్ధి, గ్లోబల్ సరఫరా గొలుసులపై చర్చ! దుబ్బాకలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీకి మంత్రి వివేక్ వెంకటస్వామి రాక జ్ఞాన సరస్వతిగా దుర్గ మాత వైభవంగా బోనాల ఉత్సవాలు అయోధ్య రామాలయ ప్రాంగణంలో అమరవీరుల స్మారకం నిర్మాణం పూర్తి: త్వరలోనే ప్రారంభానికి ఏర్పాట్లు.. నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడి!

వైభవంగా బోనాల ఉత్సవాలు

Select Suryaa Now
 వైభవంగా బోనాల ఉత్సవాలు

 


పాపన్నపేట :రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత చెంత గురువారం బోనాల జోరు హోరెత్తింది. వన దుర్గమ్మ ఆలయం చెంత ఉన్న గోకుల్ షెడ్ లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన గురువారం వనదుర్గమ్మను మహాలక్ష్మి దేవి రూపంలో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
అనంతరం గోకుల్ షెడ్ లో ప్రతిష్టించిన ఉత్సవ విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. బోనాలను డప్పు చప్పుళ్ళు.. మేళ తాళాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి వనదుర్గమ్మకు సమర్పించారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఏడుపాయల వన దుర్గమ్మ క్షేత్రం హోరెత్తింది. వనదుర్గమ్మ తల్లి.. చల్లంగా చూడమ్మా అంటూ భక్తులు వేడుకున్నారు.

భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ

మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, గొంగిడి సునీత, తుల ఉమ ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. బోనాల సమర్పణతో సంప్రదాయ భక్తి వైభవం ఉట్టిపడింది.

అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు..

గోకుల్ షెడ్ లో నిర్వహిస్తున్న ఉత్సవాల ప్రాంగణంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ అమ్మవారి కళారూపాలు, చిన్నారుల ప్రతిభాపాటవాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల ప్రదర్శనలను భక్తులు ఆసక్తిగా తిలకించి అభినందించారు.

భక్తి.. సంప్రదాయం.. ఆధ్యాత్మిక వైభవం!

అమ్మవారి దర్శనం, బోనాల సమర్పణలు, భక్తుల పూజలు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఏడుపాయల క్షేత్రం ఆధ్యాత్మిక కళను సంతరించుకుంది. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న వనదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి వీరేశం సిబ్బంది సూర్య శ్రీనివాస్ ,మధుసూదన్ రెడ్డి, ప్రతాపరెడ్డి, శ్రీనివాస్ శర్మ ,బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు