కర్నూలు జీవి మాల్ లో భారీ అగ్నిప్రమాదం
కర్నూలు నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని పార్కు రోడ్డు వద్ద ఉన్న జీవి మాల్ లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జీవి మాల్ ముందు సిబ్బంది దోమల కోసం మంట పెట్టుకోవడంతో మంటలు వ్యాపించి ప్లెక్సీలు అంటుకున్నాయని ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఈప్రమాదంలో జీవీ మాల్ ముందువైపు పూర్తిగా దహనమైంది. నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు, రెండో పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.