భద్రాచలం నూతన ట్రాఫిక్ ఎస్ఐగా పడాల కేశవ.
సూర్య న్యూస్, భద్రాచలం::భద్రాచలం పట్టణ నూతన ట్రాఫిక్ ఎస్ఐగా పడాల కేశవ నియమితులయ్యారు. సాధారణ బదిలీలలో భాగంగా ఇప్పటివరకు చర్ల ఎస్ఐగా విధులు నిర్వహించిన ఆయన భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐగా బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటివరకు భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐగా విధులు అందించిన తిరుపతిని ఉన్నతాధికారులు కొత్తగూడెంకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన ట్రాఫిక్ ఎస్ఐ కేశవ మాట్లాడుతూ.. పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.