BREAKING
కన్నెపల్లి గ్రామపంచాయతీ కార్మికులకు ఘన సన్మానం లక్కీ డ్రాలో పరిగి బార్‌కు సోమలింగం.. కొడంగల్ బార్‌కు అనిల్ ఎంపిక నర్సీపట్నంలో చైర్ పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన చింతకాయల పద్మావతి చిలీ స్పెన్స్ రాగి గని యూనియన్‌పై బిహెచ్‌పి పిటిషన్ డాటా సెంటర్ల బూమ్‌తో దూసుకెళ్తున్న స్నైడర్ ఎలక్ట్రిక్ ఐయూ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఐరోపా కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చిన రష్యా 'కాక్రోచ్ మూవ్‌మెంట్' ఆందోళనల నేపథ్యంలో దిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సద్దుల బతుకమ్మకు రాజంపేటలో ఏర్పాట్లు పూర్తి ఉక్రెయిన్‌కు అదనంగా 5 కోట్ల యూరోల ఆర్థిక సహాయం అందించనున్న జర్మనీ మూల నక్షత్ర వేడుకలకు పటిష్ట బందోబస్తు. ఎస్పీ జానకి షర్మిల : అంతర్జాతీయ రంగానికి ఆచరణాత్మక కార్యాచరణే లక్ష్యం యూరప్ బాండ్ మార్కెట్‌లో కలకలం నగరం మండలంలో రిజర్వుడు గ్రామ పంచాయతీలు లో వోల్టేజ్ సమస్యకు చెక్ బ్రిటన్ కొత్త ఆర్థిక మంత్రి చాన్స్ లీ తొలి బడ్జెట్

బతుకమ్మ సంబురాల్లో మహిళలతో కలిసిమెలిసి సందడి చేసిన మెచ్చా నాగేశ్వరరావు

Select Suryaa Now
బతుకమ్మ సంబురాల్లో మహిళలతో కలిసిమెలిసి సందడి చేసిన మెచ్చా నాగేశ్వరరావు

సూర్య , అశ్వారావుపేట :తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు* మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో బతుకమ్మ ఆడుతున్న మహిళల వద్దకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి బతుకమ్మ ఆడుతూ, పండుగ సంబురాల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ప్రజల మధ్యకు వెళ్లి వారితో కలిసిమెలిసి గడుపుతూ, స్థానికులతో ఆత్మీయ అనుబంధాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా మహిళలు మెచ్చా నాగేశ్వరరావుని శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి జూపల్లి రమణారావు,జూపల్లి పద్మజా,ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు సంక ప్రసాద్,మోహన్ రెడ్డి,యుఎస్ ప్రకాశ్ రావు,మాజీ సర్పంచ్ సాధు జ్యోత్స్న బాయి,కలపాల బాబురావు,లింగంకుంట కృష్ణ,ఆరేపల్లి రాంబాబు,రహీమూన్,జీళ్ల శ్రీదేవి,బుజ్జి బాబు,సోమాని రాజా రమేష్,ఆకుల శ్రీను,అంజి,ధర్మ,చిప్పనపల్లి శ్రీను,అబ్దుల్ రెహ్మాన్,దేవరపల్లి సాయి,అమీర్,బాలి కిరణ్,బన్ను ,సంతోష్ , తదితరులు పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వారావుపేట