నర్సీపట్నంలో చైర్ పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన చింతకాయల పద్మావతి
నర్సీపట్నం మున్సిపల్ ఛైర్మన్ టిడిపి అభ్యర్థిగా చింతకాయల పద్మావతి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు జాలుమూరు బంగార్రాజు, టి.సన్యాసిరావు టీడీపీ మద్దతుదారులు రెండు సెట్ల నామినేషన్లు వేశారు. తల్లికి మద్దతుగా ఎంపీ చింతకాయల విజయ్ పాల్గొన్నారు. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, ఎన్నికల అధికారి వివి రమణ నామినేషన్లను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రామారావు. కమిషనర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు