నో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి మూడు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు
వోల్టేజీ సమస్య పరిష్కారానికి మూడు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు
రైతులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యం: ఎఈ రవికుమార్
రైతులకు వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ను సక్రమంగా అందించడంతోపాటు, లో వోల్టేజీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజేంద్రనగర్ సర్కిల్ విద్యుత్ ఎస్ఈ రవికుమార్, కందుకూరు డీఈ గోపాలకృష్ణ లు కందుకూరు మండలంలోని ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ గ్రామాల్లో పర్యటించి విద్యుత్ సరఫరా పరిస్థితులను పరిశీలించారు.
వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఏ విధంగా జరుగుతోందని, క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉంటున్నారా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించి, విద్యుత్ సరఫరాపై వివరాలు సేకరించారు.మహేశ్వరం ప్రభుత్వ ఇన్చార్జి కేఎల్ఆర్ ఆదేశాల మేరకు మూడు కొత్త 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి లో వోల్టేజీ సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. దీంతో పంటలు ఎండిపోకుండా వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరా మెరుగుపడిందని గ్రామ సర్పంచ్ కొంగళ్ల అనిత కృష్ణ, రైతులు హర్షం వ్యక్తం చేశారు.
సమస్య పరిష్కారానికి కృషి చేసిన కేఎల్ఆర్తో పాటు విద్యుత్ శాఖ అధికారులు ఎస్ఈ డీఈ లకు సర్పంచ్, రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ సత్తినేని వెంకట్ రామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ బొర్ర యాదమ్మ రాములు, వార్డు సభ్యురాలు బుక్క లక్ష్మి రమేష్, జేఎల్ఎం శ్రీనివాస్ రెడ్డి, రైతులు పెంటయ్య, బాలయ్య, సిందం మంజుల, రాకేష్ గౌడ్, కొంగళ్ల కృష్ణ, సకిలాల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
టి. శ్రీనివాస్ :మేజర్ న్యూస్, కందుకూరు
టి. శ్రీనివాస్ : మెజర్మెంట్స్ కందుకూర్