BREAKING
సద్దుల బతుకమ్మ సంబరాలు తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్య అల్బేనియాలో ప్రతిపక్షాల భారీ ఆందోళనలు ప్రాథమిక దశలోనే కుష్ఠువ్యాధిని గుర్తించాలి బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం పంపిణీ మున్సిపల్ ఎన్నికల్లో 100 పర్సంట్ స్ట్రైక్ రేటు సాధిస్తాం... * ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఘనంగా మహా చండీ హోమం.... వెస్ట్ బ్యాంక్‌లో ఐరోపా దౌత్యవేత్తలపై దాడిని తీవ్రంగా ఖండించిన ఈయూ మహాదుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారు ఘనంగా దుర్గామాతకు బోనాలు తొమ్మిది రోజుల పాటు అన్నప్రసాద వితరణ విజయవంతం మీ ఇంటి ఆడపిల్లగా ఆశీర్వదించండి....* మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి.... బిటిపిఎస్ లో కార్మిక సంఘ నాయకుని దాతృత్వం బతుకమ్మ వేడుకలు ముగిసినా.. అందని చీరలు! నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేసిన ఎమ్మెల్యే

గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ

Select Suryaa Now
గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ

ధర్మసాగర్ , మేజర్ న్యూస్,
.బతుకమ్మ, దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ముప్పారం గ్రామ సర్పంచ్ గుంటిపల్లి రేణుక పలు వర్గాలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, భవానీ మాలధారులు, కోలాటం బృందాలకు ఆమె కానుకలు అందజేశారు.
గ్రామంలోని 12 వార్డుల్లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు ఇచ్చారు. గ్రామ కమిటీ సభ్యులకు కూడా సర్పంచ్ తన తరఫున నూతన వస్త్రాలు అందించారు. దుర్గా నవరాత్రుల సందర్భంగా 30 మంది కోలాటం కళాకారిణులకు కొత్త చీరలు బహూకరించారు. పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ రేణుక మాట్లాడుతూ, బతుకమ్మ, దసరా ఉత్సవాల విజయవంతానికి ఉత్సవ కమిటీ అద్భుతంగా కృషి చేసిందని ప్రశంసించారు. తాను గ్రామంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై రవీంద్రచారి, ఉప సర్పంచ్ తాళ్లపల్లి కుమారస్వామి గౌడ్, ఉత్సవ కమిటీ కన్వీనర్ గొట్టిముక్కుల సురేష్, మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్, మాజీ సర్పంచ్ లక్ష్మి రాజేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ ;కొట్టే పద్మయ్య, ధర్మసాగర్, హనుమకొండ జిల్లా