telanagana
ఘనంగా మహా చండీ హోమం....
సూర్య, దస్తురాబాద్ : మండల కేంద్రంలోని శ్రీ సిద్ధిధాత్రి దుర్గామాత సమితి, కొత్తగూడెం కాలనీలోని శ్రీ శివ నాట్య నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం మహా చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు నరేశాచార్యులు, వంశీకృష్ణాచార్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.