BREAKING
లక్ష గాజులతో గజలక్ష్మిగా అలంకరించుకున్న కనకమహాలక్ష్మి! కనకదుర్గాదేవిగా దుర్గమ్మ దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ 54 వ వార్డు వైసిపి అభ్యర్థిగా బాణాల శ్రీనివాసరావు నామినేషన్ చెన్నైలో దంచికొడుతున్న వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం విజయ్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సబిహాగౌసుద్దీన్‌ జీటీఎస్‌ దేవస్థానంలో ఘనంగా దుర్గాష్టమి పూజలు 17 వ వార్డు వైసిపి అభ్యర్థి నల్ల రవి నామినేషన్ దుర్గా దేవి ప్రతిరూపం బాల కన్యలు .. వానలో జోరుగా ఎన్నికల ప్రచారం 49 వ వార్డు వైసిపి అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ ఘనంగా సద్దుల బతుకమ్మ అమ్మవారి మండపాలను సందర్శించిన లక్ష్మణ్‌గౌడ్‌ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకదు.. పోలీసుల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా నయీమ్ తాజ్ బోనిలో ఘనంగా అన్నదానం...!!

ప్రాథమిక దశలోనే కుష్ఠువ్యాధిని గుర్తించాలి

Select Suryaa Now
ప్రాథమిక దశలోనే కుష్ఠువ్యాధిని గుర్తించాలి
సూర్యవాంకిడి:  కుష్ఠువ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే పూర్తిగా నయం చేసే అవకాశం ఉందని ఆరోగ్య విస్తరణ అధికారి రవిదాస్ తెలిపారు. ఈ నెల 22 నుంచి నవంబర్‌ 4వ తేదీ వరకు నిర్వహించనున్న కుష్ఠువ్యాధి గుర్తింపు కార్యక్రమం (ఎల్‌సీడీసీ)పై వాంకిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రవిదాస్ మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి ప్రజలను పరిశీలించి చర్మంపై రాగి, తెలుపు రంగు మచ్చలు ఉన్నవారిని గుర్తించాలని సూచించారు. అనుమానిత లక్షణాలు కనిపించిన వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు చేయించాలని తెలిపారు. కుష్ఠువ్యాధిపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, వ్యాధి లక్షణాలు ఉన్నవారు సకాలంలో వైద్యులను సంప్రదించేలా అవగాహన కల్పించాలని సూచించారు.
కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.