కుమారుడిపై అక్రమ కేసులు.. రాజకీయ వేధింపులే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ
వెల్దుర్తి సూర్య (రూలర్ న్యూస్):తన కుమారుడు రామమోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి, రాజకీయంగా వేధిస్తున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మండల పరిధిలోని చెరుకులపాడు గ్రామంలోని తన స్వగృహంలో శనివారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తమ ఇంటికి వచ్చిన పోలీసులు ఎలాంటి సరైన సమాచారం లేకుండా తన కుమారుడు రామమోహన్ రెడ్డిని అక్రమంగా అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారని ఆరోపించారు. సత్యనారాయణ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ నిరాధార ఆరోపణలతో తన కుమారుడిపై కేసు పెట్టారని, ఈ చర్యల వెనుక పూర్తిస్థాయి రాజకీయ కక్షసాధింపు కోణమే ఉందని మండిపడ్డారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా, ఎలాంటి తప్పుడు కేసులు పెట్టినా తాము భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అక్రమ రాజకీయాలకు పాల్పడుతున్న వారికి ఇద్దరి ఆడవాళ్ల ఉసురు తగులుతుందని ఆమె హెచ్చరించారు. సూర్య ప్రతినిధి కె రాజశేఖర్ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం
బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు
ఇద్దరి ఆడవాళ్ల ఉసురు తగులుతుంది