BREAKING
ప్రజల సుఖసంతోషాలు, రైతుల సుభిక్షం కోసం లక్ష పుష్పార్చన. 56వ డివిజన్ వైకాపా అభ్యర్థిగా గోపి జీవితంలో వంద శాతం విజయం సాధించాలంటే ఈ లక్షణాలు తప్పనిసరి: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు ఎలికట్ట అంబా భవానీ మాత ఆలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ప్రత్యేక పూజలు.. దుర్గామాత ఆశీస్సులతో గని కార్మికులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: మేయర్‌ దర్ని మధుకర్‌ విశాఖ కనకమహాలక్ష్మి దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గమ్మకు సారె సమర్పణ రణబాలి షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్న రష్మిక మందన్న: తెరవెనుక ఆసక్తికర విశేషాలు వైరల్! 39 వ వార్డు తెదేపా అభ్యర్థి గా సాకే జయప్ప పెనుగంచిప్రోలు దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గమ్మకు సారె సమర్పణ గుత్తి మున్సిపల్ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా గోవింద రాజులు తమిళ్ సెల్వి అనంతపురం స్వతంత్ర అభ్యర్థిగా మాల ఉమేష్ అందాల ఆరబోతతో మంత్రముగ్ధులను చేస్తున్న తమన్నా భాటియా: లేటెస్ట్ ఫొటోషూట్ వైరల్! టీటీడీ ఆధ్వర్యంలో దుర్గమ్మకు సారె సమర్పణ గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యం.. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటు నమోదు

ఉద్యమకారులు అలైబలైను జయప్రదం చేయాలి

Select Suryaa Now
ఉద్యమకారులు అలైబలైను జయప్రదం చేయాలి

ఉద్యమకారుల అలైబలైను జయప్రదం చేయాలి

 

అమరవీరుల స్తూపం వద్ద గోడపత్రిక ఆవిష్కరణ

 మంచాల :ఈ నెల 25న నాగోల్‌లో నిర్వహించనున్న ఉద్యమకారుల అలైబలై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉద్యమకారుల సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద శనివారం గోడపత్రికను ఆవిష్కరించారు. ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో నాగోల్‌లోని శుభం ఫంక్షన్‌ హాల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ బండి మహేష్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని ఉద్యమ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, తెలంగాణ ఉద్యమ తొలిదశ, మలిదశ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్‌ మడుపు వేణుగోపాలరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చిందని, వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 25న జరిగే అలైబలై కార్యక్రమం ద్వారా ఉద్యమకారుల ఐక్యతను, సంఘటిత శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు వినోద్‌కుమార్‌ గుప్తా, తాళ్ల వెంకటేష్‌ గౌడ్‌, ఆముదాల యాదగిరి, మండల సమన్వయకర్తలు సుధాకర్‌, మడుపు గోపాల్‌, మంచాల మండల నాయకుడు నూతనగంటి శేఖర్‌, యాచారం నాయకులు నారిమల యాదయ్య, వెంకటేష్‌ యాదవ్‌, ఉద్యమకారులు గాజుల గోపాల్‌, భర్తకి రాజు, జహీర్‌ భాయ్‌, లక్ష్మీపతి, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

✍️ఎర్ర లింగం, సూర్య రిపోర్టర్