ఈ నెల 19న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
ఈ నెల 19న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
(తిరుపతి) రేణిగుంట మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికలు, మహర్నవమి పండుగ సందర్భంగా ఈ నెల 19వ తేదీ సోమవారం తిరుపతి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించబోమని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. క్షేత్రస్థాయిలోనూ ఈ కార్యక్రమం జరగదని, ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్కు రావద్దని శనివారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు.
రిపోర్టర్ : రమేష్ బాబు కొండల