కొత్తూరు లో వాలీబాల్ పోటీలు ప్రారంభం
కొత్తూరులో వాలీబాల్ పోటీలు ప్రారంభం
యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి: సీనియర్ పాత్రికేయులు కొర్వి సురేందర్ ముదిరాజ్
కందుకూరు: విజయదశమి పండుగను పురస్కరించుకొని కందుకూరు మండలం కొత్తూరు గ్రామంలో ప్రగతి యువజన సంఘం ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. నాలుగో సీజన్లో భాగంగా శనివారం పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు కొరివి సురేందర్ మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడలతో శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాత్రికేయులు శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు హరీష్, ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్, కోశాధికారి మల్లేష్, సంఘ సభ్యులు శివప్రసాద్, జంగారెడ్డి, రాకేష్ గౌడ్,సాయి కిరణ్, గణేష్,రాజు యాదవ్ , వంశీ గౌడ్, అర్జున్, శ్రీకాంత్, సురేష్, ఆకాష్, ప్రభాకర్, ఆనంద్, ప్రశాంత్, రవితేజ, మణి, వివేక్ తదితరులు పాల్గొన్నారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్.