యూత్ డిక్లరేషన్ హామీల అమలుకు బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
పరకాల, మేజర్ న్యూస్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం పరకాల పట్టణ అధ్యక్షుడు దాసరి ప్రణీత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పరకాలలోని బీజేపీ కార్యాలయం నుంచి బస్టాండ్లోని అంబేడ్కర్ సెంటర్ వరకు బీజేవైఎం నాయకులు ర్యాలీ చేపట్టి, ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్లో పేర్కొన్న నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రాజీవ్ యువ వికాసం పథకానికి,విద్యార్థినిల స్కూటీ సంబంధించిన హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. యువత హక్కుల సాధన కోసం, వారి భవిష్యత్తు కోసం బీజేవైఎం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.నిరసన కార్యక్రమానికి బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సయ్యద్ గాలిఫ్ ఇన్చార్జిగా వ్యవహరించగా, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొలనుపాక రేవన్ సిద్ధు, క్రాంతి కుమార్ యాదవ్*, జిల్లా అధికార ప్రతినిధి కక్కు రాజు, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ వెంకటరమణ, జిల్లా సెంట్రల్ స్కీమ్ కన్వీనర్ మాచవేణి అశోక్,బీజేవైఎం జిల్లా ఆఫీస్ జాయింట్ సెక్రటరీ చెక్క సతీష్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సంతోష్ కుమార్*, పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్, పట్టణ కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్, పరకాల మండల బీజేపీ అధ్యక్షుడు రాజకుమార్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి దామెర బీజేపీ ప్రధాన కార్యదర్శి ముకేశ్, బీజేవైఎం మండల అధ్యక్షులు *రేగూరి శశిధర్ రెడ్డి, తాళ్లపల్లి హరికృష్ణ, శివ, రాచర్ల నరేష్,* పోతరాజు శ్రీకాంత్, పసరుగొండ ఉపసర్పంచ్ మంద మనోజ్తో పాటు పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్, పురుషోత్తం, పరకాల హనుమకొండ జిల్లా