BREAKING
ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మాచాని సునీత ఖరారు జనగణన 2027 ఫేజ్ -2 శిక్షణా కార్యక్రమం..జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్ ప్రజల సుఖసంతోషాలు, రైతుల సుభిక్షం కోసం లక్ష పుష్పార్చన. 56వ డివిజన్ వైకాపా అభ్యర్థిగా గోపి జీవితంలో వంద శాతం విజయం సాధించాలంటే ఈ లక్షణాలు తప్పనిసరి: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు ఎలికట్ట అంబా భవానీ మాత ఆలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ప్రత్యేక పూజలు.. దుర్గామాత ఆశీస్సులతో గని కార్మికులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: మేయర్‌ దర్ని మధుకర్‌ విశాఖ కనకమహాలక్ష్మి దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గమ్మకు సారె సమర్పణ రణబాలి షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్న రష్మిక మందన్న: తెరవెనుక ఆసక్తికర విశేషాలు వైరల్! 39 వ వార్డు తెదేపా అభ్యర్థి గా సాకే జయప్ప పెనుగంచిప్రోలు దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గమ్మకు సారె సమర్పణ గుత్తి మున్సిపల్ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా గోవింద రాజులు తమిళ్ సెల్వి అనంతపురం స్వతంత్ర అభ్యర్థిగా మాల ఉమేష్ అందాల ఆరబోతతో మంత్రముగ్ధులను చేస్తున్న తమన్నా భాటియా: లేటెస్ట్ ఫొటోషూట్ వైరల్! టీటీడీ ఆధ్వర్యంలో దుర్గమ్మకు సారె సమర్పణ

సింగరేణిలో టిబీజీకేఎస్‌ జోరు - సివిల్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి 21 మంది చేరిక

Select Suryaa Now
సింగరేణిలో టిబీజీకేఎస్‌ జోరు - సివిల్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి 21 మంది చేరిక
సూర్య నస్పూర్:శ్రీరాంపూర్‌ ఏరియాలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబీజీకేఎస్‌)లోకి సివిల్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 21 మంది కార్మికులు చేరారు. శనివారం శ్రీరాంపూర్‌లోని యూనియన్‌ కార్యాలయంలో ఏరియా అధ్యక్షుడు బండి రమేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీనియర్‌ కార్మిక నాయకుడు కొలిపాక సమ్మయ్య, ప్యాగ మల్లేష్‌, చాంద్‌ పాషాతో పాటు మరో 18 మంది కార్మికులు సంఘంలో చేరారు. వారికి రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసి రామ్మూర్తి, సీనియర్‌ కేంద్ర ఉపాధ్యక్షుడు నూనె కొమరయ్య యూనియన్‌ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టిబీజీకేఎస్‌ నాయకులు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం, ఆర్థిక ప్రయోజనాల సాధన కోసం తమ సంఘం నిరంతరం పోరాడుతోందన్నారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల ఎన్నికల గడువు ముగిసినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలపై స్పష్టత ఇవ్వాలని, గత రెండేళ్లలో భవిష్యత్తు అవసరాల పేరుతో పక్కన పెట్టిన రూ.6,323 కోట్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు పీపీఈ కిట్లు, అవసరమైన పనిముట్లు అందించాలని, నెలకు మూడు మెడికల్‌ బోర్డులు నిర్వహించాలని, 100 శాతం ఇన్‌వాలిడేషన్‌ ప్రక్రియ చేపట్టాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న 300 మంది డిపెండెంట్‌ ఉద్యోగాల సమస్యను వెంటనే పరిష్కరించాలని అన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం భవిష్యత్తులో జరిగే పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జాయింట్‌ సెక్రటరీ పానుగంటి సత్తయ్య, పొగాకు రమేష్‌, కేంద్ర కార్యవర్గ సభ్యుడు నీలం సదయ్య, బీఆర్‌ఎస్‌ నస్పూర్‌ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు.