BREAKING
80 శాతం రాయితీతో ఉద్యాన పంటలకు నీటి సరఫరా ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మాచాని సునీత ఖరారు జనగణన 2027 ఫేజ్ -2 శిక్షణా కార్యక్రమం..జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్ ప్రజల సుఖసంతోషాలు, రైతుల సుభిక్షం కోసం లక్ష పుష్పార్చన. 56వ డివిజన్ వైకాపా అభ్యర్థిగా గోపి జీవితంలో వంద శాతం విజయం సాధించాలంటే ఈ లక్షణాలు తప్పనిసరి: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు ఎలికట్ట అంబా భవానీ మాత ఆలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ప్రత్యేక పూజలు.. దుర్గామాత ఆశీస్సులతో గని కార్మికులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: మేయర్‌ దర్ని మధుకర్‌ విశాఖ కనకమహాలక్ష్మి దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గమ్మకు సారె సమర్పణ రణబాలి షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్న రష్మిక మందన్న: తెరవెనుక ఆసక్తికర విశేషాలు వైరల్! 39 వ వార్డు తెదేపా అభ్యర్థి గా సాకే జయప్ప పెనుగంచిప్రోలు దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గమ్మకు సారె సమర్పణ గుత్తి మున్సిపల్ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా గోవింద రాజులు తమిళ్ సెల్వి అనంతపురం స్వతంత్ర అభ్యర్థిగా మాల ఉమేష్ అందాల ఆరబోతతో మంత్రముగ్ధులను చేస్తున్న తమన్నా భాటియా: లేటెస్ట్ ఫొటోషూట్ వైరల్!

కార్మికులకు తాత్కాలిక ఉపశమనమే - రూ.10 వేల నజరానా

Select Suryaa Now
కార్మికులకు తాత్కాలిక ఉపశమనమే - రూ.10 వేల నజరానా
సూర్య,కాగజ్‌నగర్‌ :కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల సమ్మె తాత్కాలికంగా విరమించినప్పటికీ, వారి ప్రధాన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. పండుగ వేళ కుటుంబాలతో సంతోషంగా గడిపేందుకు కార్మికులు ఆశించిన బకాయి వేతనాలు, పీఎఫ్‌ చెల్లింపుల సమస్యలు అలాగే ఉండిపోగా, ఒక్కొక్క కార్మికుడికి రూ.10 వేల చొప్పున అడ్వాన్స్‌ అందించేందుకు అధికారులు హామీ ఇవ్వడంతో సమ్మెకు తాత్కాలికంగా తెరపడింది. దీంతో కార్మికుల సమస్యలు పూర్తిగా పరిష్కారమైనట్లు కాకుండా, పండుగ ఖర్చులకు కొంత ఊరట మాత్రమే లభించినట్లయింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌ కె. హరిత ఆదేశాల మేరకు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మార్మట్‌, కాగజ్నగర్ సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి చొరవ తీసుకుని కార్మికులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రతి కార్మికుడికి రూ.10 వేల అడ్వాన్స్‌ అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా మున్సిపల్‌ నిధుల నుంచి రూ.5 వేల చొప్పున గురువారం కార్మికుల ఖాతాల్లో జమ చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ బి. తిరుపతి తెలిపారు. మిగిలిన రూ.5 వేల చొప్పున జిల్లా కలెక్టర్‌ నిధుల నుంచి అందించనున్నట్లు పేర్కొన్నారు.
అయితే, కార్మికుల పెండింగ్‌ వేతనాలు, పీఎఫ్‌ సమస్యలను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో కార్మికుల ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన పరిష్కారం రావాల్సి ఉంది. పండుగ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు రూ.10 వేల అడ్వాన్స్‌ కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బకాయిల చెల్లింపులే వారికి అసలైన ఊరటనివ్వనున్నాయి.పండుగ సమయంలో ప్రజలకు పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా సమ్మె విరమించి, మధ్యాహ్నం నుంచే విధుల్లో చేరాలని మున్సిపల్‌ కమిషనర్‌ బి. తిరుపతి కార్మికులకు సూచించారు. దీంతో కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు అంగీకరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహీన్‌ సుల్తానా, కౌన్సిలర్లు పాల్గొన్నారు.రూ.10 వేల అడ్వాన్స్‌తో పండుగ గడిచినా.. పెండింగ్‌ వేతనాలు, పీఎఫ్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎప్పుడన్నదే ఇప్పుడు కార్మికుల ముందున్న ప్రశ్న!