telanagana
అడెల్లి గంగనీళ్ల జాతరకు పటిష్ట భద్రత - జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి:నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సాంగ్వి సమీపంలోని గోదావరి నది వద్ద నిర్వహించనున్న అడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల జాతరకు 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు. బందోబస్తు సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో భక్తుల రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, గోదావరి వద్ద భద్రతపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ, నదిలో లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, డీఎస్పీ శ్రీనివాస్తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.