సూర్య కరీంనగర్ ప్రతినిధి శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శనివారం రూపాయల (కరెన్సీ) అలంకరణలో శ్రీ మహాలక్ష్మీ దేవి (కాలరాత్రి) అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ మహాదుర్గ అమ్మవారు. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు నిజపాద దర్శనం ఇవ్వగా, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులను అనుగ్రహించారు.