అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
మేజర్ న్యూస్, మంచాల;మంచాల:గ్రామంలోని శ్రీ హరిహర మహాక్షేత్రంలో కొలువుదీరిన శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం మంచాల గ్రామ సర్పంచ్ మానస వినయ్ అమ్మవారికి ముక్కుపుడక సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మంచాల గ్రామ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. దసరా పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ హరిహర మహాక్షేత్రం దుర్గామాత కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.
✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల