టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి... బ్లాస్టింగ్కు ప్రయత్నిస్తున్న వ్యక్తి అరెస్ట్
సూర్య కరీంనగర్ ప్రతినిధి నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు సైదాపూర్ మండలం సోమవారం గ్రామంలో మెరుపు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ అనే రైతు పొలంలో బ్లాస్టింగ్కు ప్రయత్నిస్తున్న వేముల భూమయ్య (తండ్రి: ఎల్లయ్య)ను పోలీసులు పట్టుకున్నారు. అతన్ని తనిఖీ చేయగా 475 జిలెటిన్ స్టిక్స్, 3,000 మీటర్ల డిటోనేటింగ్ కార్డు (వైరు) లభించాయి.స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలతో పాటు నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం సైదాపూర్ పోలీసులకు అప్పగించారు.ఈ దాడిలో ఎస్ఐలు సురేందర్, శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, సురేంద్ర, పాల్ సింగ్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాజయ్య, సాయి, దీప్, విశ్వతేజ పాల్గొన్నారు.