BREAKING
అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు యండమూరి వరప్రసాద్ మృతి బస్సు సౌకర్యం కల్పించండి.... ‘మేము నక్సలైట్లం కాదు’.. సెన్సార్ బోర్డు తీరుపై పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ భవానీలకు ఘనంగా బిక్ష కార్యక్రమం రణబాలి ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్: గ్రాండ్ ఓపెనింగ్‌తో దుమ్మురేపిన విజయ్-రష్మిక జంట! వెంకటగిరి చైర్ పర్సన్ అభ్యర్థిగా దొంతు శారదా దేవి నామినేషన్ దాఖలు కుమారుడిపై అక్రమ కేసులు.. రాజకీయ వేధింపులే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ యూత్ డిక్లరేషన్ హామీల అమలుకు బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కడపలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దాడులు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో శ్రీ మహాదుర్గ అమ్మవారు కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణను జయప్రదం చేయాలి..పర్ణశాల పంచాయతీ తీర్మానం. ఆదర్శ కుటుంబం విడుదల తేదీపై స్పష్టత ఇచ్చిన నిర్మాత నాగవంశీ: వెంకటేశ్ చేతుల మీదుగా అధికారిక ప్రకటన! టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి... బ్లాస్టింగ్‌కు ప్రయత్నిస్తున్న వ్యక్తి అరెస్ట్

పోలంపల్లి జెడ్పీటీసీ బరిలో కిలారు చిన్ని? పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన సీనియర్ నాయకుడికి అవకాశం దక్కేనా?

Select Suryaa Now
పోలంపల్లి జెడ్పీటీసీ బరిలో కిలారు చిన్ని?  పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన సీనియర్ నాయకుడికి అవకాశం దక్కేనా?

వత్సవాయి మేజర్ న్యూస్ :- రానున్న జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామంలో రాజకీయ చర్చలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పోలంపల్లి జెడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున కిలారు చిన్ని పేరు పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ, కార్యకర్తలకు అండగా నిలిచి, గ్రామంలో పార్టీ బలోపేతానికి కిలారు చిన్ని కృషి చేసినట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ గ్రామస్థాయిలో కార్యకర్తలతో, ప్రజలతో మమేకమై పనిచేశారని వారు చెబుతున్నారు.పోలంపల్లి గ్రామంలో ఒకప్పుడు బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీని తిరిగి బలోపేతం చేయడంలో కిలారు చిన్ని కీలకంగా వ్యవహరించారని ఆయన మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ కష్టకాలంలోనూ వెనక్కి తగ్గకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉండటంతో ఆయనకు సీనియర్ నాయకుడిగా గుర్తింపు వచ్చిందని చెబుతున్నారు.ఇదే సమయంలో జెడ్పీటీసీ అభ్యర్థిత్వంపై ఆయన పేరు తెరపైకి రావడంతో పోలంపల్లి గ్రామ రాజకీయాల్లో చర్చ మొదలైంది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య,  రఘురాం, జనార్దన్ తదితర పార్టీ పెద్దల ఆశీస్సులు ఆయనకు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే అభ్యర్థిత్వంపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన నాయకులకు ఎన్నికల్లో అవకాశం కల్పించాలనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కిలారు చిన్ని అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తుందా? ఆయనకు జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం దక్కుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.మరోవైపు ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ వివిధ రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. దీంతో పోలంపల్లి జెడ్పీటీసీ స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న అంశంపై స్థానిక రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.పార్టీ అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారయ్యే వరకు కిలారు చిన్ని పేరు పరిశీలనలో ఉన్న అభ్యర్థిగా మాత్రమే చూడాల్సి ఉంటుంది. తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానం తీసుకోవాల్సి ఉంది.