BREAKING
అభివృద్ధి లక్ష్యంగా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ మేనిఫెస్టో. పెద్దేముల్ ఎఫ్‌ఎస్‌సీఎస్‌ను పీఎస్‌సీఎస్‌గా మారుస్తాం: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 35వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా మాల ఉమేష్ నామినేషన్.. నయీ నవేలీ మొదటి రోజు వసూళ్లు: యామీ గౌతమ్ మైథలాజికల్ హర్రర్ కామెడీ గ్రాండ్ ఓపెనింగ్! రామాయణ సినిమా రూ. 4000 కోట్ల బడ్జెట్‌పై రాకింగ్ స్టార్ యష్ క్లారిటీ: సెన్సేషనల్ కామెంట్స్ చీరాల చైర్మన్ అభ్యర్థిగా హనీ స్పందన ఖరారు.. సామాన్య కార్యకర్తకు టీడీపీ అవకాశం! రణబాలి సినిమా చూసి థియేటర్‌లోనే బోరున ఏడ్చేసిన మా అమ్మ: విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల శిక్షణా తరగతులను పరిశీలించిన ఆర్టీవో. మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు కోలీవుడ్ దీపావళి బాక్సాఫీస్ సమరం: సూర్య, నయనతార సినిమాల మధ్య హోరాహోరీ పోరు! పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐదో రోజుకు చేరిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె-వినూత్న బిక్షాటనతో నిరసన రోమియో జూలియట్ సినిమా విడుదల వాయిదా: కొత్త తేదీని ప్రకటించిన మేకర్స్ కళ్యాణదుర్గం టి డీ పి ఎన్నికల ప్రచారం జోరు. 22,27,28 వార్డుల్లో ఇంటింటా ప్రచారం. కనకదుర్గమ్మ సన్నిధిలో అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే.

కూటమి ప్రభుత్వంతోనే కడప అభివృద్ధి

Select Suryaa Now
కూటమి ప్రభుత్వంతోనే కడప అభివృద్ధి

కడప మేజర్ న్యూస్ :కడప కార్పొరేషన్ కూటమి మేయర్ అభ్యర్థిగా డాక్టర్ మట్లి సువర్ణ.కడప ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించి, కూటమి అధిష్టానం, అధినేత నారా చంద్రబాబు నాయుడు  నిర్ణయం మేరకు మేయర్ అభ్యర్థిగా డాక్టర్ మట్లి సువర్ణ  పేరును ప్రకటించిన ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి గారు మరియు టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి . 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉన్నత విద్యావంతురాలు, మంచి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మహిళ డాక్టర్ మట్లి సువర్ణ గారిని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  ఎంపిక చేశారని తెలిపారు. ఆమె భర్త డాక్టర్ మధుసూదన్ రెడ్డి  ఎన్నో ఏళ్లుగా కడప ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ అందరి ఆదరణ పొందిన కుటుంబమని పేర్కొన్నారు. కడపలో మహిళా ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో, కార్పొరేషన్ పీఠంపై కూడా చదువుకున్న మహిళా మేయర్ వస్తే నగర సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.  గత 20 ఏళ్లుగా కార్పొరేషన్‌లో వైసీపీ అవినీతి, అక్రమాలు, దోపిడీ తప్ప చేసిందేమీ లేదని, రాష్ట్రంలోనే అవినీతి ఆరోపణలతో పదవి కోల్పోయిన చరిత్ర వారి మేయర్‌దని మండిపడ్డారు. మరోవైపు హత్యారాజకీయాలు, భూకబ్జాలు, ఇప్పటికీ 307 కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి భార్యను వైసీపీ అభ్యర్థిగా నిలిపిందని తీవ్రంగా విమర్శించారు. నేర చరిత్ర ఉన్నవారిని తరిమికొట్టి, స్వచ్ఛమైన సేవలందించే డాక్టర్ మట్లి సువర్ణ గారికి, 66 డివిజన్ల కూటమి అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కడప ప్రజలకు పిలుపునిచ్చారు.