కనకదుర్గమ్మ సన్నిధిలో అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే.
దుమ్ముగూడెం సూర్య మేజర్ న్యూస్::భద్రాచలం ఇండస్ట్రియల్ ఏరియాలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమాన్ని భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రారంభించారు.ముందుగా అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, అనంతరం తన చేతుల మీదుగా అన్నదానాన్ని ప్రారంభించి కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించగా, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.