ఐదో రోజుకు చేరిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె-వినూత్న బిక్షాటనతో నిరసన
*హనుమకొండ, మేజర్ న్యూస్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో 78 క్యాడర్లలో పనిచేస్తున్న సుమారు 17,000 మంది ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం ఐదో రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు *భిక్షాటన కార్యక్రమం* నిర్వహించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. 78 క్యాడర్లలో పనిచేస్తున్న 17,000 మంది ఉద్యోగులందరినీ ఎటువంటి షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి , బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ సమ్మెకు సంఘీభావం తెలిపి, భిక్షాటన కార్యక్రమంలో పాల్గొని పూర్తి మద్దతు ప్రకటించారు.నిరసన కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రుక్ముద్దీన్, రాష్ట్ర కోశాధికారి నరేష్, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, సభ్యులు ,చంద్రమౌళి , విజయ్, సంతోష్, సురేందర్ జి, కిరణ్, నరేష్, మాధురి, సావన్య, రాజలక్ష్మి ,త్రివేణి , నగేష్ సుష్మ ,ప్రశాంత్, దినేష్ , నరేష్ ,మరియు కాంటినెంట్ వర్కర్ నుండి డాక్టర్ల వరకు ఉద్యోగులు వందల సంఖ్యలో పాల్గొన్నారు .
రిపోర్టర్: వేణుగోపాల్, హనుమకొండ, హనుమకొండ జిల్లా