రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
కడప నగరంలో జరుగుతున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా నామినేషన్ సెంటర్ల వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష పార్టీ కార్యాలయం ముందు రోడ్డుపై కూర్చొని శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగరంలో తెలుగుదేశం పార్టీకి నాయకులకు పూర్తిస్థాయిలో పోలీసులు లొంగిపోయి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని పోలీసులపై ఆయన మండిపడ్డారు.
కడప రిపోర్టర్ వేణు.