వైసిపి టిడిపి మధ్య భారీ ఘర్షణ భారీగా కాల్పులు తెలిపిన పోలీసులు
పులివెందుల మేజర్ న్యూస్ : పులివెందులలో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇరువర్గాల మధ్య రాళ్లదాడి జరగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఏర్పడటంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ క్రమంలో ఆత్మరక్షణ చర్యగా డీఎస్పీ రెండు రౌండ్లను గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో ఘర్షణ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఘర్షణకు దారితీసిన కారణాలు, ఘటనలో గాయపడిన వారి వివరాలు, పోలీసుల తదుపరి చర్యలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పి కృష్ణ పులివెందల స్టాప్ రిపోర్టర్ కడప జిల్లా