రాజంపేటలో వైభవంగా జెండా ఆవిష్కరణ
సూర్య రాజంపేట :రాజంపేట మండల కేంద్రంలో విజయదశమి సందర్భంగా సంప్రదాయబద్ధంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. దసరా రోజు సాయంత్రం జమ్మి పూజ అనంతరం గ్రామస్థులందరూ ఒకచోట చేరి గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరిస్తారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయ వేడుకను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ వేడుక గ్రామ ఐక్యతకు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది…