రైతులకు 500 బోనస్ ఇవ్వలీ
1. అన్నిరకాల వరి ధాన్యంకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలుపరచాలి**
2. దసరా పండుగ లోపే వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి*
3. బియ్యం రేట్లు డబల్ అయినప్పటికీ వడ్ల రేట్లు మాత్రం పెరుగుతలేవు ఎందుకు?*
4. రైతులు దళారుల మాటలు నమ్మి తక్కువకు అమ్ముకోవద్దు అని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాలి*
పాలకూరి రవి గౌడ్ బిజెపి రాష్ట్ర నాయకులు**
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను దసరా పండుగ లోపే ప్రారంభించాలని బిజెపి రాష్ట్ర నాయకులు పాలకూరి రవి గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ.
ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావంతో రైతులు వరి నాట్లు చాలా తక్కువగా వేశారు, దానికి తోడు కరెంటు సరిగా లేక, వర్షాలు పడక పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏదో కొద్దో గొప్పో పండిన వరి ధాన్యానికి కూడా ధర తక్కువగా ఉండటం వల్ల రైతుకు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తామని ఇచ్చిన హామీని ఇప్పుడు అమలు చేయాలని కోరుతున్నాము. సన్న రకంతో సహా అన్ని రకాల వడ్లకు ప్రస్తుతం ఉన్న ధరతో పాటు అదనంగా 500 రూపాయలు బోనస్ చెల్లించాలని ,వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలి. ఈ కొద్దిగా పండిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కల్పిస్తే రైతులకు ఎంతో కొంత ఆసరాగా ఉంటుంది. ఇప్పుడు వరి కోతలు ప్రారంభమయ్యాయి కాబట్టి మిల్లర్లు, దళారులు కలిసి రైతుల పంటను అడ్డగోలుగా దోచుకోవడం జరుగుతోంది. బియ్యం రేట్లు డబల్ అయి కొండెక్కాయి కానీ వడ్ల రేట్లు మాత్రం పెరుగుతలేవు, బియ్యం రేటు పెరిగినప్పుడు వడ్ల రేటు ఎందుకు పెంచట్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. పంట తక్కువగా వచ్చింది కాబట్టి పండిన రైతుకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి. చివరగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ముందస్తుగా స్పష్టమైన హామీ ఇవ్వాలని, దళారుల మాటలు నమ్మి తక్కువ రేటుకు వడ్లను అమ్ముకోవద్దని, దసరా లోపే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇవ్వాలని కోరుతున్నాము.
_- పాలకూరి రవి గౌడ్, బిజెపి రాష్ట్ర నాయకులు_