నల్గొండ జిల్లా పరిషత్
నల్గొండ జిల్లా పరిషత్ ఆధీనంలోని విధులు నిర్వహిస్తున్న అప్గ్రేడెడ్ జూనియర్ అసిస్టెంట్లు పోస్టులను డీ గ్రేడ్ చేస్తూ, రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీలలో సీనియార్టీ ప్రాతిపదికన రోస్టర్ పాయింట్ల ఆధారంగా జూనియర్ అసిస్టెంట్ (13) మందికి తేదీ 16.10.2026 న జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో *శ్రీ ఎన్. ప్రేమ్ కరణ్ రెడ్డి, ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా ప్రజా పరిషత్ నల్లగొండ* గారు ఉత్తర్వులు అందచేసినారు.
ఇట్టి కార్యక్రమంలో *శ్రీమతి ఆర్.అలివేలుమంగమ్మ,* డిప్యూటీ సీఈవో, *శ్రీ కొప్పు రాంబాబు , అధ్యక్షులు*
*పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ నల్గొండ గారలు* , పర్యవేక్షకులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.