జనసేనకు గుడ్‌బై.. వైఎస్సార్సీపీలోకి గూడూరు వెంకటేశ్వర్లు
మున్సిపల్ ఎన్నికల వేళ వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీకి చెందిన సీనియర్ నేత గూడూరు వెంకటేశ్వర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి, శుక్రవారం వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పి గూడూరు వెంకటేశ్వర్లును సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల సమయంలో ఆయన చేరిక పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని, పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తాము అని తెలిపారు.