సోగనూరులో వైఎస్సార్సీపీలోకి 21 కుటుంబాల చేరిక
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి :ఎమ్మిగనూరు మండలం సోగనూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 21 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. గ్రామ మాజీ జెడ్పీటీసీ భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో, వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా టీడీపీకి చెందిన 21 కుటుంబాల సభ్యులు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, హనుమంతు, మారయ్య, శ్రీనివాసులు, రాజు, రంగన్న, సూరిబాబు, కనకన్న, రామలింగడు, హుసేని తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోగనూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ చేరికలు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.