BREAKING
కళ్యాణదుర్గం టి డీ పి ఎన్నికల ప్రచారం జోరు. 22,27,28 వార్డుల్లో ఇంటింటా ప్రచారం. కనకదుర్గమ్మ సన్నిధిలో అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే. రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్: ఎన్టీఆర్, అల్లు అర్జున్ మల్టీస్టారర్ సినిమాపై నెట్టింట భారీ చర్చ! అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు యండమూరి వరప్రసాద్ మృతి బస్సు సౌకర్యం కల్పించండి.... ‘మేము నక్సలైట్లం కాదు’.. సెన్సార్ బోర్డు తీరుపై పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ భవానీలకు ఘనంగా బిక్ష కార్యక్రమం రణబాలి ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్: గ్రాండ్ ఓపెనింగ్‌తో దుమ్మురేపిన విజయ్-రష్మిక జంట! వెంకటగిరి చైర్ పర్సన్ అభ్యర్థిగా దొంతు శారదా దేవి నామినేషన్ దాఖలు కుమారుడిపై అక్రమ కేసులు.. రాజకీయ వేధింపులే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ యూత్ డిక్లరేషన్ హామీల అమలుకు బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కడపలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దాడులు

లాటరీ విధానంలో పారదర్శకంగా బార్ కేటాయింపు.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

Select Suryaa Now
లాటరీ విధానంలో పారదర్శకంగా బార్ కేటాయింపు.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

 

--లాటరీ విధానంలో పారదర్శకంగా కల్లూరు 2బి బార్ కేటాయింపు... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*

--ఒక బార్ కేటాయింపు కోసం మొత్తం 325 దరఖాస్తులు

--వీడియో రికార్డింగ్ మధ్య పారదర్శకంగా డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహణ

--లాటరీలో చుంచుపల్లికి చెందిన చావా తరుణ్‌కు బార్ కేటాయింపు

--కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా బార్ కేటాయింపు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్;; పసుపులేటి సత్యనారాయణ 


ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒక 2బి బార్ కేటాయింపు ప్రక్రియను లాటరీ విధానంలో పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు.శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ సమక్షంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో బార్ కేటాయింపు కోసం డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహించారు.*జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ*  కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒక 2బి బార్ కేటాయింపు కోసం మొత్తం 325 దరఖాస్తులు అందినట్లు  తెలిపారు. లాటరీ ప్రక్రియలో భాగంగా ప్రతి దరఖాస్తుదారుకు కేటాయించిన టోకెన్ నంబర్‌ను నాణెంపై ప్రదర్శించి, ఆ నాణేలను ఒక స్టీల్ బాక్స్ లో ఉంచారు. అనంతరం బాక్స్ లో నుంచి ఒక నాణేన్ని తీసి విజేతను ఎంపిక చేశారు.లాటరీ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించామని ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రతి దశను వీడియో రికార్డింగ్ చేసినట్లు తెలిపారు.దరఖాస్తుదారులకు సమాన అవకాశాలు కల్పించే విధంగా నిబంధనల ప్రకారం డ్రా నిర్వహించామని, ఈ లాటరీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లికి చెందిన చావా తరుణ్ (తండ్రి: శ్రీనివాస్ రావు)కు డ్రా వచ్చిందని ఈ విధంగా లాటరీ ద్వారా బార్ కేటాయింపు ప్రక్రియను నిర్వహించామని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి బి. జానయ్య, ఎక్సైజ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.