కన్నెపల్లి గ్రామపంచాయతీ కార్మికులకు ఘన సన్మానం
సూర్య, కౌటాల : మండలంలో కన్నెపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం గ్రామపంచాయతీ కార్మికులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ మోర్లె పార్వతి కార్మికులను సన్మానించి, వారికి పండుగ కానుకలను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మోర్లె పార్వతి మాట్లాడుతూ.. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రతతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామపంచాయతీ కార్మికులు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. వారి కృషిని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.పండుగ వేళ గ్రామపంచాయతీ కార్మికులను సన్మానించి దసరా కానుకలు అందజేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల సేవలను గుర్తించి వారిని గౌరవించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోర్లె సమత-రాజు, పంచాయతీ కార్యదర్శి తోడుకూనూరి సాయికృష్ణ, వార్డు సభ్యులు చెన్నూరి తిరుమలేష్, మోర్లె వనిత, ఆదే మంజుల, యువ నాయకులు మోర్లె పాండురంగ్, జునారీ రమేష్, లెండుగూరే గణపతి, జునారీ భీమ్రావు, నాగోసే దశరథ్, మందడే రమేష్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.