BREAKING
అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు యండమూరి వరప్రసాద్ మృతి బస్సు సౌకర్యం కల్పించండి.... ‘మేము నక్సలైట్లం కాదు’.. సెన్సార్ బోర్డు తీరుపై పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ భవానీలకు ఘనంగా బిక్ష కార్యక్రమం రణబాలి ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్: గ్రాండ్ ఓపెనింగ్‌తో దుమ్మురేపిన విజయ్-రష్మిక జంట! వెంకటగిరి చైర్ పర్సన్ అభ్యర్థిగా దొంతు శారదా దేవి నామినేషన్ దాఖలు కుమారుడిపై అక్రమ కేసులు.. రాజకీయ వేధింపులే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ యూత్ డిక్లరేషన్ హామీల అమలుకు బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కడపలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దాడులు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో శ్రీ మహాదుర్గ అమ్మవారు కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణను జయప్రదం చేయాలి..పర్ణశాల పంచాయతీ తీర్మానం. ఆదర్శ కుటుంబం విడుదల తేదీపై స్పష్టత ఇచ్చిన నిర్మాత నాగవంశీ: వెంకటేశ్ చేతుల మీదుగా అధికారిక ప్రకటన! టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి... బ్లాస్టింగ్‌కు ప్రయత్నిస్తున్న వ్యక్తి అరెస్ట్

ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత... బిఆర్ఎస్ యువనేత వై రవీందర్ యాదవ్

Select Suryaa Now
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత... బిఆర్ఎస్ యువనేత వై రవీందర్ యాదవ్

*ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత* 

*బిఆర్ఎస్ యువనేత, కేశంపేట మాజీ ఎంపీపి వై రవీందర్ యాదవ్* 

*కోట మైసమ్మ ఆలయంలో మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ ప్రత్యేక పూజలు*

*సరస్వతి దేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు*

*నియోజకవర్గ ప్రజలకు ముందస్తు దసరా శుభాకాంక్షలు*

ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను పెంచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత పొందడమే కాక దేవుని కృపా కటాక్షాలు పొందిన వారు అవుతారని బిఆర్ఎస్ యువనేత, కేశంపేట మాజి ఎంపిపి వై రవీందర్ యాదవ్ అన్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణంలోని రైతు కాలనీలోని ప్రసిద్ధ కోట మైసమ్మ ఆలయంలో శుక్రవారం వేడుకలు వైభవంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ యువనేత, కేశంపేట మాజీ ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆయన అమ్మవారికి భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజలు జరిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరికీ ముందస్తు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ జగన్మాత దయాకటాక్షాల వల్ల ప్రజలంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు  పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

జవాజి రాఘవేందర్ గౌడ్, మేజర్ న్యూస్ షాద్ నగర్.