లో వోల్టేజ్ సమస్యకు చెక్
కొండపాక :సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో చాలాకాలంగా వేధిస్తున్న లో-వోల్టేజ్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. రాబోయే బతుకమ్మ, దసరా ఉత్సవాల దృష్ట్యా గ్రామంలో వోల్టేజ్ సమస్య ఉందని గుర్తించిన సర్పంచ్ విషయాన్ని కొలుపుల గంగాధర్ విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు గ్రామంలో నూతన ట్రాన్స్ ఫార్మర్ ను మంజూరు చేసి ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో విద్యుత్ సమస్య తొలగిపోయిందని, పండుగ సమయంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉంటుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించిన విద్యుత్ అధికారులకు, కృషి చేసిన సర్పంచ్ కు గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్ మెన్ ఎండి హాసన్, చారి, వార్డు సభ్యులు గంగుల రాజు, కారోబార్ లక్ష్మణ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.