సద్దుల బతుకమ్మకు రాజంపేటలో ఏర్పాట్లు పూర్తి
సూర్య రాజంపేట : సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాజంపేట గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామంలోని ఊర చెరువు, దేవుని చెరువు వద్ద జేసీబీ సహాయంతో పరిసరాలను శుభ్రం చేయించారు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొనే మహిళలు, గ్రామస్తులకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సౌకర్యం కల్పించారు. పండుగను సంతోషంగా జరుపుకునేందుకు అవసరమైన కనీస సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను గ్రామ సర్పంచ్ దుబ్బని శ్రీకాంత్, ఉపసర్పంచ్ ఇమ్రాన్ అలీ, వార్డు సభ్యులు పర్యవేక్షించారు...