BREAKING
ఈనెల 20 లోపు రైతులు ఈ కేవైసీ చేసుకోండి పోలంపల్లి జెడ్పీటీసీ బరిలో కిలారు చిన్ని? పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన సీనియర్ నాయకుడికి అవకాశం దక్కేనా? యూరోపియన్ యూనియన్‌తో సహకారానికి సిద్ధంగా ఉన్న చైనా దసరా పండుగకు ముందే మున్సిపల్ కార్మికులకు జీతాలు, బట్టలు, సబ్బులు, నూనెలు ఇవ్వాలి: సీఐటీయూ నో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి మూడు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు అర్బన్ హౌసింగ్ కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీద రవిచంద్ర తో జనసేన నేతల భేటీ రాజంపేటలో వైభవంగా జెండా ఆవిష్కరణ షేర్ శంకర్ తాండాలో ఇందిరమ్మ ఇళ్లకు మార్కింగ్.. ఏలూరులో నామినేషన్లకు పటిష్ట బందోబస్తు లాటరీ విధానంలో పారదర్శకంగా బార్ కేటాయింపు.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ నంద్యాలలో ఎస్ఐపిఐకి టీడీపీ షాక్- సైకిల్ ఎక్కిన ఎసిపిఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు 8 కౌంటర్లు ఏర్పాటు. పోటీలకు బయలుదేరిన క్రీడాకారులు ఐదవ రోజు లక్ష్మీదేవి అమ్మవారి అవతారం

జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ లో విద్యార్థులు

Select Suryaa Now
జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ లో విద్యార్థులు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఅనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈనెల 12, 13, 14 తేదీలలో జరిగిన 70వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ తైక్వాండో పోటీలలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచి,అంబాజీపేటకు చెందిన విద్యార్థులు పతకాల సాధించారు. యు/14 బాలికల 20 కేజీల విభాగంలో అంబాజీపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు కుడుపూడి కావ్య, సుందరి హరిప్రియలు గోల్డ్ మెడల్స్ ,38 కేజీల విభాగంలో తొండవరం హైస్కూల్ విద్యార్థిని మంద మౌనిక సిల్వర్ మెడల్,

యు/17 బాలుర 41 కేజీల విభాగంలో  సెంట్ మేరీ హైస్కూల్ విద్యార్థి బైరిశెట్టి హేమ రితిక్ బ్రాంజ్ మెడల్స్  సాధించారు.రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన కుడుపూడి కావ్య, సుందరి హరిప్రియలు నవంబర్ నెలలో హిమాచల్ ప్రదేశ్ లో జరగబోయే జాతీయస్థాయి తైక్వాండో స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపికైనట్లు జిల్లా తైక్వాండో ప్రధాన కార్యదర్శి పి. త్రిమూర్తులు తెలిపారు. విజేతలను ప్రజా ప్రతినిధులు, స్కూల్ యాజమాన్య కమిటీ సభ్యులు,ఎంఈఓ మోకా ప్రకాష్,హెచ్ ఎం కె.సాయిరాం,కోచ్ లు టి. రాజశేఖర్,డి.రాఘవేంద్ర, క్రీడాకారులు అభినందించారు.