స్థానిక ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల పరిశీలన
జీలుగుమిల్లి, సూర్య న్యూస్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయనున్న కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్లను అధికారులు పరిశీలించారు.ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్ల భద్రత, ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు.ఈ పరిశీలనలో ఎంపీడీవో వెంకటలక్ష్మి, ఎంఈఓ శ్రీనివాస్, ఎస్ఐ క్రాంతి కుమార్, డిప్యూటీ ఎంపీడీవో నిఖిల్ మధు శరణ్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి కామేష్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టరు బొంతు రామకృష్ణ జీలుగుమిల్లి ఏలూరు జిల్లా,