లేని ప్రాజెక్టు పేరుతో సీతక్క ఇసుక దోపిడి-బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ
మంగపేట, మేజర్ న్యూస్,
లేని ప్రాజెక్టు పేరుతో సీతక్క మండలంలో ఇసుక దోపిడీ చేస్తుందని బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం తన ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో కరెంటు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మంత్రి సీతక్క ఆలోచన ఇసుక క్వారీల మీద ఇసుక దోపిడీ మీద ఉన్న శ్రద్ధ మండల ప్రజల మీద లేదని ఎద్దేవా చేశారు. ఏటూరునాగారం నుంచి బ్రాహ్మణపల్లి వరకు ఇసుక లారీల కారణంగా ప్రధాన రహదారి గుంతల మయంగా మారినప్పటికీ కనీసం ప్యాచ్ వర్క్ చేసే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి సీతక్కలేదని అన్నారు. మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మించినా... నాసిరకంగా కట్టడంతో ప్రారంభానికి నోచుకోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మరియు మంత్రి సీతక్క రైతులకు 24 గంటల కరెంటుతో పాటు మండలంలోని సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బి ఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఎడ్లపల్లి నరసింహారావు, కర్రి శ్యాంబాబు, మండల నాయకులు గుండేటి రాజు యాదవ్, రమేష్, మీడియా వారియర్స్ గుడివాడ శ్రీహరి మరియు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: స్నేహ కుమార్ ,మంగపేట, ములుగు జిల్లా