లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
సూర్య, పెంచికల్పేట్:మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను తహసీల్దార్ బోడ రవీందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక చేయూత అందుతున్నదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీటీ ఆత్రం చిన్ను, ఆర్ఐ రాజేష్,బీజేపీ మండల అధ్యక్షుడు కుకిడే రాజేశ్వర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సముద్రాల రాజన్న, సర్పంచులు భక్తు రాంచందర్, దుర్గం పోసన్న, బీఆర్ఎస్ నాయకులు చౌదరి తిరుపతి, బండి చలం, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.