BREAKING
ఘనంగా మహా చండీ హోమం.... వెస్ట్ బ్యాంక్‌లో ఐరోపా దౌత్యవేత్తలపై దాడిని తీవ్రంగా ఖండించిన ఈయూ మహాదుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారు ఘనంగా దుర్గామాతకు బోనాలు తొమ్మిది రోజుల పాటు అన్నప్రసాద వితరణ విజయవంతం మీ ఇంటి ఆడపిల్లగా ఆశీర్వదించండి....* మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి.... బిటిపిఎస్ లో కార్మిక సంఘ నాయకుని దాతృత్వం బతుకమ్మ వేడుకలు ముగిసినా.. అందని చీరలు! నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేసిన ఎమ్మెల్యే కౌన్ బనేగా క్యాండిడేట్?! సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన అశ్వారావుపేట పోలీసులు* అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ ఆడిన మాజీ చైర్‌పర్సన్ స్వేరో జిల్లా కమిటీ ఎన్నిక జనసేనకు సముచిత ప్రాధాన్యత కల్పించాలి: ఎమ్మెల్యేకు వినతి చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహం

మహబూబాబాద్ లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి-జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యునికి బార్ అసోసియేషన్ వినతి

Select Suryaa Now
మహబూబాబాద్ లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి-జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యునికి బార్ అసోసియేషన్ వినతి

కేసముద్రం, మేజర్ న్యూస్, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ మహబూబాబాద్ బార్ అసోసియేషన్ ప్రతి నిధులు ఆదివారం జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాతోత్ హుస్సేన్ నాయక్ ను మచ్చర్లలోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పిం చారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు,సీనియర్ న్యాయవాదులు హుస్సేన్ నాయక్ కు స్థానిక న్యాయపరమైన అవసరాలను వివరిం చారు.మహబూబాబాద్ జిల్లాలో సుమారు 42 శాతానికి పైగా గిరిజన జనాభా ఉందని, జిల్లాలోని మహబూబా బాద్ పార్లమెంట్ స్థానంతో పాటు మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు అసెంబ్లీ నియోజక వర్గాలు గిరిజనులకే కేటాయించబడ్డాయని గుర్తుచేశారు. అలాగే పాలకుర్తి, నర్సంపేట నియోజకవర్గాలలోని కొన్ని మండలాలు సైతం మహబూబాబాద్ జుడీషియల్ జిల్లా పరిధిలోకి వస్తాయని తెలిపారు.2022 జూన్ నుండి మహబూబా బాద్ కోర్టు ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ కోర్టుగా అప్‌గ్రేడ్ అయినప్పటికీ,జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనాభా, కేసుల సంఖ్య విపరీతం గా పెరిగిపోయాయని న్యాయవాదులు పేర్కొన్నారు.ప్రస్తుతం ఉన్న వరంగల్ లో ఉన్న కోర్టులపై పనిభారం ఎక్కువగా ఉండటం వల్ల ముఖ్యంగా వెనుకబడిన,గిరిజన వర్గాలకు చెందిన బాధితులకు న్యాయం జరగడంలో తీవ్ర ఆలస్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు త్వరిత గతిన న్యాయం అందాలంటే ఇక్కడ ప్రత్యేక ఎస్సీ,ఎస్టీ కోర్టు ఏర్పాటు అత్యంత ఆవశ్యకమని వివరిం చారు.ఈ విషయమై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ సానుకూలంగా స్పందిస్తూ, తగిన చర్యల కోసం ఉన్నతా ధికారులకు, ప్రభుత్వా నికి సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మహ బూబాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షు లు మామిడాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జంగం సిద్ధార్థ, కోశాధికారి కొర్ర మున్నా, స్పోర్ట్స్ సెక్రటరీ బుర్ర శ్రీనివాస్ గౌడ్, కార్యవర్గ సభ్యులు దర్శనం రామకృష్ణ, సీనియర్ న్యాయవాదులు తుంపిళ్ల శ్రీనివాస్,బి. అమర్‌నాథ్ గుప్తా, జంపాల విశ్వ, పిన్ని రాము తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్, వెంకన్న, కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా