BREAKING
సద్దుల బతుకమ్మతో రామిడి స్వప్న విజయ్ రెడ్డి రాజీవ్ గాంధీ నగర్ టేకుచెట్ల బజారులో సద్దుల బతుకమ్మ సంబరాలు రామకృష్ణాపూర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. • వేడుకల్లో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నగర పాలక సంస్థలో ముగిసిన నామినేషన్ల పర్వం -- మేయర్ పదవికి 12, కార్పొరేటర్ స్థానాలకు 343 దాఖలు గుర్రంకొండకు విచ్చేసిన కాంగ్రెస్ అతిరథ మహారథులు ఉత్కంఠకు తెర -ముగిసిన నామినేషన్ల ఘట్టం -మూడవరోజు ఉద్రిక్తతల మధ్య కొనసాగిన నామినేషన్ల పర్వం -మందకొడిగా సాగిన నామినేషన్లు -ఆసక్తి చూపని పలు పార్టీల అభ్యర్థులు -సుమారు 20 డివిజన్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవం -నేడు నామినేషన్ల స్కూటీని పదేళ్ల తర్వాత పూర్వవిద్యార్థుల అపూర్వ కలయిక ముంబైలో కలకలం: నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. సురక్షితంగా బయటపడ్డ హీరో సమైక్యతతో పండుగలు జరుపుకోవాలి • రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద ఈ మండలంలో నిబంధనలు ఉండవా?? తెలంగాణలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబురాలు సింగరేణిలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు సేవే లక్ష్యంగా అన్నప్రసాదాలు పంపిణీ పెనుగొండ కామాక్షి అమ్మవారి ఆలయంలో ఘనంగా దుర్గాష్టమి పూజలు ఎంఆర్‌వీ కథకు జాతీయస్థాయి బహుమతి

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ ఆడిన మాజీ చైర్‌పర్సన్

Select Suryaa Now
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ ఆడిన మాజీ చైర్‌పర్సన్
సూర్య జగిత్యాల ప్రతినిధి జగిత్యాల పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీ గాయత్రీ దుర్గాదేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రీ దుర్గాదేవి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం జగిత్యాల పట్టణంలోని నవదుర్గ క్షేత్ర పీఠంలో నిర్వహిస్తున్న దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా మహిళలతో కలిసి అమ్మవారి సన్నిధిలో బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు. నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ వేడుకలతో ఆలయాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, మహిళలు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.