BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

పెనుగొండ కామాక్షి అమ్మవారి ఆలయంలో ఘనంగా దుర్గాష్టమి పూజలు

Select Suryaa Now
పెనుగొండ కామాక్షి అమ్మవారి ఆలయంలో ఘనంగా దుర్గాష్టమి పూజలు

వాసవి పెనుగొండ, సూర్య న్యూస్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం దుర్గాష్టమిని పురస్కరించుకుని పెనుగొండ శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఉత్సవాల్లో ఎనిమిదో రోజు సందర్భంగా శ్రీ దుర్గాదేవిని ఆవాహన చేసి శ్రీ లలితా సహస్రనామ కుంకుమ పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన శ్రీ దేవీ మండపంలో దుర్గాదేవి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. వేద మంత్రోచ్చారణలు, అమ్మవారి నామస్మరణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ కామాక్షి అమ్మవారికి అలంకరణ నిమిత్తం చీరను పెనుగొండకు చెందిన కొండవేటి వెంకట సూర్యనారాయణమూర్తి, శారద దంపతులు సమర్పించారు.దుర్గాష్టమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

రిపోర్టర్ : పి.వెంకట్రామయ్య , పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా