సేవే లక్ష్యంగా అన్నప్రసాదాలు పంపిణీ
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : గత 18 సంవత్సరాలుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు సేవే లక్ష్యంగా భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నామని టిటిడి జెఎసి నాయకులు తెలిపారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవ సందర్భంగా టీటీడీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం అలిపిరి గరుడ సర్కిల్ వద్ద అన్నదానం చేశారు. జేఏసీ అధ్యక్షులు ఆంజనేయులు పాల్గొని సుమారు 3000 మంది భక్తులకు వివిధ రకాల అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు సేవ చేయడమే లక్ష్యంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. శ్రీవారి ఆశీస్సులతో భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ భక్తులకు మరింత సేవలందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి జేఏసీ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ రెడ్డి, ట్రెజరర్ వెంకటరత్నం, వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ భరత్, డాక్టర్ వరుణ్, సుబ్రహ్మణ్యం రెడ్డి డాక్టర్ బెల్లం ప్రసాద్, జేఏసీ నాయకులు అరుణ్, గజేంద్ర, క్రాంతి, వెంకట ముని, ఎంప్లాయీస్ బ్యాంక్ డైరెక్టర్లు, కిషోర్, చీర్ల కిరణ్, రవికుమార్, బొట్టు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్