BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

నస్పూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు • అలరించిన చిన్నారుల సందడి

Select Suryaa Now
నస్పూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు  • అలరించిన చిన్నారుల సందడి

సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : నస్పూర్ టౌన్‌లో బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకయైన ఈ పూల పండుగలో మహిళలతో పాటు చిన్నారులు విశేషంగా పాల్గొని పండుగ శోభను మరింత ద్విగుణీకృతం చేశారు.

వేడుకల్లో భాగంగా స్థానిక మహిళలు రంగురంగుల బంతి, చామంతి, తంగేడు వంటి విధవిధాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. చిన్నారులు సాంప్రదాయ దుస్తులు, ఆభరణాలు ధరించి, తమ తలలపై బతుకమ్మలను ఎత్తుకుని వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆటలాడుతున్న చిన్నారుల సందడి ప్రతి ఒక్కరినీ అలరించింది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించడంలో ఇటువంటి వేడుకలు ఎంతో కీలకమని, చిన్నారులు ఇంత ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల భాగస్వామ్యంతో నస్పూర్ టౌన్ అంతా పండుగ వాతావరణం నెలకొంది.