BREAKING
లక్ష గాజులతో గజలక్ష్మిగా అలంకరించుకున్న కనకమహాలక్ష్మి! కనకదుర్గాదేవిగా దుర్గమ్మ దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ 54 వ వార్డు వైసిపి అభ్యర్థిగా బాణాల శ్రీనివాసరావు నామినేషన్ చెన్నైలో దంచికొడుతున్న వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం విజయ్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సబిహాగౌసుద్దీన్‌ జీటీఎస్‌ దేవస్థానంలో ఘనంగా దుర్గాష్టమి పూజలు 17 వ వార్డు వైసిపి అభ్యర్థి నల్ల రవి నామినేషన్ దుర్గా దేవి ప్రతిరూపం బాల కన్యలు .. వానలో జోరుగా ఎన్నికల ప్రచారం 49 వ వార్డు వైసిపి అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ ఘనంగా సద్దుల బతుకమ్మ అమ్మవారి మండపాలను సందర్శించిన లక్ష్మణ్‌గౌడ్‌ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకదు.. పోలీసుల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా నయీమ్ తాజ్ బోనిలో ఘనంగా అన్నదానం...!!

స్వేరో జిల్లా కమిటీ ఎన్నిక

Select Suryaa Now
స్వేరో జిల్లా కమిటీ ఎన్నిక
సూర్య,కాగజ్‌నగర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా స్వేరో నూతన కమిటీని ఆదివారం కాగజ్‌నగర్‌లోని ప్రాణహిత నిలయంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షతన కొదపక రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా దొంగ్రే సురేష్, అధ్యక్షుడిగా కె. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గోలేటి నాగేష్, కోశాధికారిగా లింగాల గణేష్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కృష్ణపల్లి సురేష్, దుర్గం రవి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా గొల్లపల్లి ఆనంద్, కుమ్రం మహేష్ ఎంపికయ్యారు. ఇతర బాధ్యతల్లో మహేందర్, రాజు, డి. మహేష్, ఏ. హరీష్‌తో పాటు పలువురికి స్థానం కల్పించారు.జిల్లాలో విద్యా చైతన్యం పెంపొందించడం, యువతలో నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం, సామాజిక సమానత్వం కోసం కృషి చేయడం, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడటం తమ ప్రధాన లక్ష్యాలని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. స్వేరో ఉద్యమాన్ని జిల్లావ్యాప్తంగా బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు.