సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన అశ్వారావుపేట పోలీసులు*
సూర్య అశ్వరావుపేట,అశ్వారావుపేట మండల పరిధిలో ప్రజలకు సైబర్ నేరాలపై అశ్వారావుపేట పోలీసులు అవగాహన కల్పించారు, ఆన్లైన్ మోసాలు, ఓటిపి మోసాలు, ఫేక్ లింకులు, యూపీఐమోసాలు, సోషల్ మీడియా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరితోనూ ఓటిపి, ఏటీఎం పిన్, బ్యాంక్ వివరాలు పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని అశ్వారావుపేట అదనపు ఎస్సై దేవ్ సింగ్ సూచించారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట