BREAKING
శ్రమ క్షేత్రంలో బతుకమ్మ సంబరం-గంగారం ఉపాధి పనుల్లో పండుగ వాతావరణం కూటమి ప్రభుత్వంతోనే కడప అభివృద్ధి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్, కావ్య మారన్ వివాహం: రిసెప్షన్‌కు తమిళనాడు సీఎం విజయ్ ఆహ్వానం ఆర్టీసీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఐక్య కూటమి(EU-TMU@NMU) కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి ని గెలిపించాలి. బీజేపీ నాయకులు. మెగాస్టార్ ‘కాకా’ సినిమాకు స్టార్ సినిమాటోగ్రాఫర్.. మెరుపులు ఏ స్థాయిలో ఉండబోతున్నాయంటే? నూతన ఎస్హెచ్ఓ కి ఆటో యూనియన్ స్వాగతం* పుంగనూరులో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమన్వయ సమావేశం. కల్కి 2 షూటింగ్ షురూ: సాయిపల్లవి ఎంట్రీపై క్లారిటీ మరియు రిలీజ్ డేట్ అప్‌డేట్ రోడ్లపై కాంక్రీట్‌ మిశ్రమం.. ప్రమాదాలకు ఆహ్వానం! మోపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా గిడ్డయ్య యాదవ్ ఖరారు మంచిర్యాల కలెక్టరేట్‌లో లిఫ్ట్‌ మూగబోయింది - ప్రజలకు మెట్లే దిక్కు చెరువులో పడి మృతి చెందిన యువకుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు: దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ విడుదల!

పోలీస్‌ ఫ్లాగ్‌ డే సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలు

Select Suryaa Now
పోలీస్‌ ఫ్లాగ్‌ డే సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలు

సూర్య-గోదావరిఖని:పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్‌ ఫ్లాగ్‌ డే వారోత్సవాల సందర్భంగా తెలంగాణ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఆన్‌లైన్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల విద్యార్థులు, ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

*పోటీ విభాగాలు:*

- *ఫొటోగ్రఫీ* : పోలీసుల సేవలు, స్పందనను ప్రతిబింబించే మూడు ఫొటోలు సమర్పించాలి.
- *షార్ట్‌ఫిల్మ్‌* : గరిష్ఠంగా మూడు నిమిషాల నిడివి ఉండాలి.
- *వ్యాసరచన* (6–12వ తరగతి): సైబర్‌ నేరాల నివారణలో పోలీసు–పౌరుల పాత్ర లేదా డ్రగ్స్‌ నివారణలో పోలీసుల పాత్ర.
- *వ్యాసరచన* (డిగ్రీ–పీజీ): సోషల్‌ మీడియా దుర్వినియోగ నివారణలో పోలీసుల పాత్ర లేదా డ్రగ్స్‌ రహిత తెలంగాణ నిర్మాణంలో నా పాత్ర.

ఫొటోలు, షార్ట్‌ఫిల్మ్‌లను అక్టోబర్‌ 28లోపు https://forms.gle/gVpPmmWFrWZNNRBF6 లింక్‌లో, వ్యాసాలను అక్టోబర్‌ 26లోపు https://forms.gle/YkeKUscWu5LFYWFH7 లింక్‌లో సమర్పించాలి. వ్యాసం 500 పదాలకు మించకూడదు. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో రాయవచ్చు.

వ్యాసరచనలో జిల్లా స్థాయి విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు ముగ్గురిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని సీపీ తెలిపారు. విద్యార్థులు, ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
-------