BREAKING
కేపీఎల్ క్రికెట్ పోటీలు ప్రారంభం అభివృద్ధి లక్ష్యంగా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ మేనిఫెస్టో. పెద్దేముల్ ఎఫ్‌ఎస్‌సీఎస్‌ను పీఎస్‌సీఎస్‌గా మారుస్తాం: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 35వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా మాల ఉమేష్ నామినేషన్.. నయీ నవేలీ మొదటి రోజు వసూళ్లు: యామీ గౌతమ్ మైథలాజికల్ హర్రర్ కామెడీ గ్రాండ్ ఓపెనింగ్! రామాయణ సినిమా రూ. 4000 కోట్ల బడ్జెట్‌పై రాకింగ్ స్టార్ యష్ క్లారిటీ: సెన్సేషనల్ కామెంట్స్ చీరాల చైర్మన్ అభ్యర్థిగా హనీ స్పందన ఖరారు.. సామాన్య కార్యకర్తకు టీడీపీ అవకాశం! రణబాలి సినిమా చూసి థియేటర్‌లోనే బోరున ఏడ్చేసిన మా అమ్మ: విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల శిక్షణా తరగతులను పరిశీలించిన ఆర్టీవో. మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు కోలీవుడ్ దీపావళి బాక్సాఫీస్ సమరం: సూర్య, నయనతార సినిమాల మధ్య హోరాహోరీ పోరు! పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐదో రోజుకు చేరిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె-వినూత్న బిక్షాటనతో నిరసన రోమియో జూలియట్ సినిమా విడుదల వాయిదా: కొత్త తేదీని ప్రకటించిన మేకర్స్ కళ్యాణదుర్గం టి డీ పి ఎన్నికల ప్రచారం జోరు. 22,27,28 వార్డుల్లో ఇంటింటా ప్రచారం.

రోడ్లపై కాంక్రీట్‌ మిశ్రమం.. ప్రమాదాలకు ఆహ్వానం!

Select Suryaa Now
రోడ్లపై కాంక్రీట్‌ మిశ్రమం.. ప్రమాదాలకు ఆహ్వానం!
సూర్య మంచిర్యాల టౌన్‌:మంచిర్యాల పట్టణంలో రెడీమిక్స్‌ కాంక్రీట్‌ (ఆర్‌ఎంసీ) వాహనాల రాకపోకలు ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.కాలేజీ రోడ్‌ నుంచి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వరకు ప్రతిరోజూ తిరుగుతున్న ఆర్‌ఎంసీ వాహనాల నుంచి కంకర, ఇసుక, కాంక్రీట్‌ మిశ్రమం రోడ్డుపై పడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై నిర్మాణ సామగ్రి చెల్లాచెదురుగా పడటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- నిబంధనలు ఉన్నా.. అమలు ఏది?
నిర్మాణ సామగ్రిని తరలించే వాహనాలు రహదారులపై ప్రయాణించే సమయంలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. వాహనాల నుంచి కంకర, ఇసుక, సిమెంట్‌ మిశ్రమం బయటకు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాల డ్రమ్‌లు, తొట్టెలు, పైపుల నుంచి కాంక్రీట్‌ మిశ్రమం లీకేజీ కాకుండా నిర్వహణ చేపట్టాలి. ఒకవేళ రోడ్డుపై నిర్మాణ సామగ్రి పడితే వెంటనే తొలగించి రహదారిని శుభ్రం చేయాల్సిన బాధ్యత సంబంధిత వర్గాలపై ఉంటుంది. అయితే మంచిర్యాల పట్టణంలోని కాలేజీ రోడ్డులో ఈ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
- పాఠశాలలు, ఆసుపత్రులకు వెళ్లే వారికి ఇబ్బందులు
కాలేజీ రోడ్డులో పలు పాఠశాలలు, మాతా శిశు ఆసుపత్రి మహాప్రస్థానం వంటి ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. నిత్యం విద్యార్థులు, తల్లిదండ్రులు, రోగులు, అంబులెన్సులు, ఇతర వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి రద్దీ ప్రాంతంలో రోడ్డుపై కాంక్రీట్‌ మిశ్రమం పేరుకుపోవడం ప్రమాదకరంగా మారుతోంది.ద్విచక్ర వాహనదారులు మిశ్రమంపై ప్రయాణించే సమయంలో వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.అత్యవసర వైద్య సేవల కోసం ఆసుపత్రులకు వెళ్లే వారికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది.
- కౌన్సిల్‌లో ఫిర్యాదు చేసినా స్పందనేదీ?
ఈ సమస్యపై బీజేపీ కార్పొరేటర్‌ నాగరాజు ఇప్పటికే కౌన్సిల్‌లో మున్సిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.అయినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదని స్థానికులు వాపోతున్నారు.ప్రజల భద్రతకు సంబంధించిన అంశంపై ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకోవాలి ఆర్‌ఎంసీ వాహనాల నుంచి రోడ్డుపై నిర్మాణ సామగ్రి పడకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, రహదారిపై పడిన కంకర, ఇసుక, కాంక్రీట్‌ మిశ్రమాన్ని వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్న కాలేజీ రోడ్డులో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.